జనం న్యూస్ నందలూరు కడప జిల్లా.19-01-26
కడప నుండి రేణిగుంట వరకు నూతనంగా నిర్మించబోతున్న జాతీయ రహదారి నుండి మండల కేంద్రానికి మరియు ఒంటిమిట్టకు వెళ్లుటకు ప్రస్తుతమున్న రహదారికి కనెక్టివిటీ రోడ్డు ఏర్పాటు చేయాలని నందలూరు లయన్స్ మరియు వాకర్స్ క్లబ్స్ ఆధ్వర్యంలో ప్రతినిధులు మరియు స్థానిక యువత కలిసి ఇవాళ రాజంపేట జనసేన పార్టీ పార్లమెంట్ ఇంచార్జ్ ఎల్లటూరు శ్రీనివాసరాజుని కలిసి వినతి పత్రం అందించడం జరిగిందిఈ సందర్భంగా టీటీడీలో విలీనమైన నందలూరు సౌమ్యనాథ స్వామి దేవస్థానం మరియు ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి ఆలయం లకు పెద్ద ఎత్తున రాష్ట్రంలోని జిల్లాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు వచ్చి దర్శించుకోవడం జరుగు తుందని, ఈ క్రమంలో నందలూరు ఆల్విన్ ఫ్యాక్టరీ నుండి మంటపంపల్లి మధ్యలో కనెక్టివిటీ రోడ్ ఉన్నట్లయితే ఇటు సౌమ్యనాథ స్వామి ఆలయం మరియు కోదండరామస్వామి ఆలయాలకు భక్తులు వెళ్లి దర్శించుకొనుటకు ఉపయోగ కరంగా ఉంటుందని తద్వారా కనెక్టివిటీ రోడ్ ఉండటం వలన స్థానికంగా కొంత అభివృద్ధి కూడా జరిగే అవకాశం ఉందని కావున రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లి తప్పనిసరిగా కనెక్టివిటీ రోడ్డు మంజూరు చేయటానికి మీ సహకారం అందించాలని శ్రీనివాసరాజు ని క్లబ్స్ ప్రతినిధులు కోరడం జరిగింది.అనంతరం మన్నెం.రామ మోహన్ మాట్లాడుతూ అరవపల్లి జిల్లా పరిషత్ మైదానము కాంపౌండ్ వాల్ తో సహా ట్రాక్ కూడా దెబ్బతిన్న కారణంగా నిత్యం పాదచారులకు నడకకు మరియు స్థానిక యువత ఆటలాడుకొనుట కొరకు చాలా ఇబ్బందికరంగా ఉన్నదని పలుమార్లు నందలూరు వాకర్స్ క్లబ్ ద్వారా సొంత నిధులు వెచ్చించి పనులు చేయడం జరిగిందని, ఈ సమస్యను ఉన్నతాధికారులకు నివేదించి మైదానం తో సహా రక్షణ చర్యల కొరకు కాంపౌండ్ వాల్ ను పునరుద్ధరించగలరని కోరగా శ్రీనివాస రాజు స్పందించి పై రెండు సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి ప్రభుత్వ పరంగా చేపట్టవలసిన ఆవశ్యకతను వారికి తెలియజేసి తప్పనిసరిగా పనులు చేయటానికి తమ వంతు ప్రయత్నం చేయగలనని హామీ ఇవ్వడం జరిగింది .
ఈ కార్యక్రమంలో శివరామ రాజు ఎక్స్ జడ్పిటిసి, సమ్మెట శివప్రసాద్ మాజీ సర్పంచ్, వాకర్స్ క్లబ్ ప్రతినిధులు మన్నెం రామమోహన్, కుర్రా. మణి యాదవ్, ఉప్పు శెట్టి సుధీర్, మోడపోతుల రాము, గంధంగంగాధర్,తోటశివశంకర్,మంటి మారయ్య గండికోట కృష్ణకుమార్,పాటూరు రమేష్, జయచంద్ర, త్యాగరాజు, వెంకటేష్, బద్రి రమేష్, రాఘవ, రేగిమడుగుల హేమంత్, రవి, అజయ్, నరసింహ, ఇమ్రాన్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.


