జనం న్యూస్ 19 జనవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
రాజాం మున్సిపాలిటీ డోలపేటలో పట్నాల సంతోషి (26) అనే వివాహిత శనివారం సాయంత్రం ఉరివేసుకుని మృతి చెందిందని స్థానికులు తెలిపారు. మృతురాలు, ఆమె భర్త కలిసి టిఫిన్ సెంటర్ నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, మరణానికి గల కారణాలపై దర్యాప్తు జరుపుతున్నారు.


