Listen to this article

సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ జనవరి 18

ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ పోటీల అనంతరం మంద గుమ్మిడి తండా జట్టు ప్రత్యర్థి జట్టును ఓడించి కప్పును సొంతం చేసుకుంది. ఈ ఫైనల్ మ్యాచ్‌కు ముఖ్య అతిథులుగా సిఐ శివలింగం, ఎస్సై రాజేందర్ రెడ్డి, ఎస్సై నరేష్, ఎస్సై వినయ్ కుమార్ హాజరై విజేత జట్టుకు తమ చేతుల మీదుగా కప్పు మరియు బహుమతులను అందజేశారు. కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ మిలిటరీ రాజు విష్ణు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ శివలింగం మాట్లాడుతూ యువత క్రీడలతో పాటు ట్రాఫిక్ నిబంధనలను కూడా కచ్చితంగా పాటించాలని సూచించారు. ముఖ్యంగా డ్రింక్ అండ్ డ్రైవ్ చేయరాదని, హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడపకూడదని, కారులో ప్రయాణించే వారు తప్పనిసరిగా సీటు బెల్టు ధరించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాలు జరిగితే కుటుంబాలు తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటాయని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా వాహనాలు నడపాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, గ్రామ పెద్దలు, క్రీడాభిమానులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజేత జట్టును అభినందించారు.