Listen to this article

జుక్కల్ జనవరి 19 జనం న్యూస్

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చట్టం తెలుగు దినపత్రిక , HMTV, ప్రజా దర్బార్, నూతన సంవత్సర క్యాలెండర్లను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ఆవిష్కరించారు..ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ పాల్గొన్నారు.. ఈ సందర్భంగా నూతన సంవత్సర క్యాలెండర్లను ఆవిష్కరించి మీడియా సంస్థల సేవలను ఎమ్మెల్యే ప్రశంసించారు..ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు సమర్థంగా చేరవేయడంలో మీడియా కీలక పాత్ర పోషిస్తుందని ఎమ్మెల్యే తెలిపారు.. నూతన సంవత్సరంలో ప్రజా సమస్యల పరిష్కారానికి అందరూ కలిసి పనిచేయాలని ఆకాంక్షించారు..ఈ కార్యక్రమంలో మీడియా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు..