సంగారెడ్డి జిల్లా ఇన్చార్జి బి వీరేశం జనం న్యూస్ జనవరి 19
నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ శివలింగం మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. టూ వీలర్ నడిపే వారు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలన్నారు, అలాగే ఫోర్ వీలర్ వాహనాల్లో ప్రయాణించే వారు సీట్ బెల్ట్ తప్పకుండా పెట్టుకోవాలని హెచ్చరించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల అనేక కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని, డ్రింక్ అండ్ డ్రైవ్ చేస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే 3000 రూపాయల నుంచి 10000 రూపాయల వరకు భారీ చలాన్లు విధిస్తామని తెలిపారు. ప్రజల భద్రతే పోలీసుల ప్రధాన లక్ష్యమని, రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సీఐ శివలింగం పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం ద్వారా వాహనదారుల్లో అవగాహన పెంచి ప్రమాదాలను తగ్గించాలనే ఉద్దేశంతో ట్రాఫిక్ చెకింగ్‌తో పాటు సూచనలు, హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిపారు.



