Listen to this article

జనం న్యూస్: జనవరి 19(రిపోర్టర్: కొత్తమాసు అజయ్ కుమార్, యర్రగొండపాలెం, మార్కాపురం జిల్లా)


సంక్రాంతి పండుగ సెలవులు ముగియడంతో సొంతూళ్ల నుంచి నగరాలకు వెళ్తున్న ప్రయాణికులతో వినుకొండ ఆర్టీసీ బస్టాండ్ కిక్కిరిసిపోయింది. పండుగ ముగించుకుని తిరిగి తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి ప్రయాణికులు భారీ సంఖ్యలో బస్టాండ్‌కు చేరుకున్నారు. పండుగ సెలవుల అనంతరం పెరిగిన విపరీతమైన రద్దీ, బస్సు ఎక్కే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది గాయపడిన వారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా అదనపు బస్సులు లేకపోవడమే ఈ పరిస్థితికి కారణమని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.