Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955

ల్ ఇండియా యువజన కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ఎం లెనిన్ ప్రసాద్

దేశంలోని అన్ని వ్యవస్థలు బలంగా ఉండి దేశం సుభిక్షంగా ఉండాలి అంటే కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండాలి అంటే యువజన కాంగ్రెస్ బలంగా ఉండాలని ఆలిండియా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఇన్చార్జ్ ఎం లెనిన్ ప్రసాద్ అన్నారు. యువజన కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీకి వెన్నెముక వంటిదని వెన్నెముక బలంగా ఉంటేనే వ్యక్తి బలంగా ఉంటాడని అభివర్ణించారు. వెన్నెముక బలంగా ఉంటేనే మనిషి బలంగా ఉంటాడని యువజన కాంగ్రెస్ సంపూర్ణమైన బలాన్ని సంతరించుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ విజయం నల్లేరు మీద నడకవుతుందని అభిప్రాయపడ్డారు ప్రస్తుతం యువజన కాంగ్రెస్ ఎన్నికలు జరుగుతున్నాయని ఈ ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతి అభ్యర్థి విజేత అవుతారని అయితే సాధించిన ఓట్ల శాతాన్ని బట్టి పదవుల కేటాయింపు జరుగుతుందని అన్నారు ఈ అద్భుతమైన విధానాన్ని రూపొందించిన ఘనత ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ కే దక్కుతుందని శ్లాఘించారు .రాష్ట్ర యువజన కాంగ్రెస్ బాధ్యునిగా అనేక జిల్లాలలో పర్యటించానని యువజన కాంగ్రెస్ కార్యకర్తలు బలంగానే ఉన్నారని తన పర్యటన ద్వారా అర్థం చేసుకున్నానని అన్నారు. చరిత్ర ప్రసిద్ధి చెందిన పల్నాడు జిల్లాలో యువజన కాంగ్రెస్ మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు
ఇప్పటివరకు జిల్లాలో అత్యధిక నామినేషన్లు వేసిన ఘనత చిలకలూరిపేట నియోజక వర్గానికి కాంగ్రెస్ పార్టీకి యువజన కాంగ్రెస్కే దక్కుతుందని అన్నారు. ఎన్నికల్లో పోటీ పడితేనే నాయకుల సత్తా బయటపడుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త ఎం రాధాకృష్ణ పల్నాడు జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న ఇంటూరి భవాని వెంకటేష్ చిలకలూరిపేట నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నామినేషన్ సమర్పించిన కారు చోల స్వప్న కుమార్ జిల్లా కాంగ్రెస్ నాయకులు చే రెడ్డి శ్రీరామ రెడ్డి ఎర్రగళ్ల రవికుమార్ రెడ్డెం నర్సిరెడ్డి నాదెండ్ల మండల కాంగ్రెస్ అధ్యక్షుడు షేక్ బాజీ ఎడ్లపాడు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సాగి నరసింహారావు, రాష్ట్ర కాంగ్రెస్ మైనారిటీ సెల్ నాయకులు హాజీ షేక్ సలాం షేక్ నసరుద్దీన్ జిల్లా కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షుడు జాస్తి నాగాంజనేయులు సీనియర్ కాంగ్రెస్ నాయకులు బొడ్లపాటి రామకోటేశ్వరరావు మిరియాల వెంకటరత్నం దాసరి శ్యాంబాబు శబరి రాజు, మైనారిటీ నాయకులు షేక్ ఫక్రుద్దీన్ షేక్ దాదాసాహెబ్ బీసీ నాయకులు ఉప్పాల వెంకటస్వామి అన్నపురెడ్డి వెంకటేశ్వర్లు ఎం పిచ్చయ్య ఆచారి సిహెచ్ కోటయ్య పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.