జనం న్యూస్ 19 జనవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
పరిశుభ్రమైన వాతావరణంలో నాణ్యమైన ఆహారాన్ని అన్న క్యాంటీన్ల ద్వారా అందించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని మున్సిపల్ కమిషనర్ కిల్లాన అప్పలరాజు అన్నారు. సోమవారం విజయనగరంలో ఉన్న అన్న క్యాంటీన్‌ను సందర్శించి అక్కడ నెలకొన్న పరిస్థితులను గమనించారు. అన్న క్యాంటీన్లో అల్పాహారాన్ని పలువురితో కలిసి భుజించారు. ఆహార పదార్థాలు ఎలా ఉన్నాయని, పరిసర ప్రాంతాల పరిశుభ్రత పాటిస్తున్నారా అని పరిశీలించారు.


