జనం న్యూస్ 19 జనవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
విజయనగరం జిల్లా పూసపాటిరేగలో 2021లో నమోదైన వరకట్న వేధింపులు, ఆత్మహత్య ప్రేరణ కేసులో నిందితుడు మడపాన సుధీర్ (31)కు 3 సంవత్సరాల జైలు శిక్ష మరియు రూ.5,000/- జరిమానా విధిస్తూ విజయనగరం 5వ అదనపు జిల్లా సెషన్స్ జడ్జి ఎన్.పద్మావతి జనవరి 19న తీర్పు వెల్లడించారు. ఈ వివరాలను జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ తెలిపారు.కేసు వివరాలు:శ్రీకాకుళం జిల్లా బూర్జ గ్రామానికి చెందిన మడపాన సుధీర్‌కు, పొందూరు మండలం ఎగటిపేట గ్రామానికి చెందిన సోనియాతో 2021 మే నెలలో వివాహం జరిగింది. వివాహానంతరం వీరిద్దరూ పూసపాటిరేగలోని సాలిపేట వీధిలో నివాసం ఉండేవారు. కొంతకాలం తర్వాత అదనపు కట్నం కోసం భర్త సుధీర్ మరియు అతని తల్లిదండ్రులు సోనియాను శారీరకంగా, మానసికంగా వేధించడం మొదలుపెట్టారు. ఈ వేధింపులు భరించలేక సోనియా 15-12-2021న తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.పోలీసు దర్యాప్తు:మృతురాలి తల్లి జి.పైడమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పటి పూసపాటిరేగ ఎస్ఐ ఆర్.జయంతి కేసు నమోదు చేశారు. మహిళా పోలీస్ స్టేషన్ డిఎస్పీ టి.త్రినాధరావు దర్యాప్తు చేపట్టి, నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో అభియోగపత్రం దాఖలు చేశారు.
కోర్టు తీర్పు:సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయస్థానం నిందితుడు సుధీర్ పై నేరారోపణలు రుజువు కావడంతో:శిక్ష: 3 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష.జరిమానా: రూ. 5,000/-.ఈ కేసులో సమర్థవంతంగా పనిచేసిన మహిళా పిఎస్ డిఎస్పీ ఆర్.గోవిందరావు, సిఎంఎస్ ఎఎస్ఐ పి.మల్లేశ్వరరావు, కోర్టు కానిస్టేబులు శ్రీనివాసరావు, పిపి వై.రేవతిలను జిల్లా ఎస్పీ అభినందించారు.


