జనం న్యూస్ జనవరి 20 తెలంగాణ స్టేట్ ఇంచార్జి శ్రీనివాస్ రెడ్డి
బాలాజీ నగర్ డివిజన్ బీజేపీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ (గోపి) జన్మదినం సందర్భంగా ఈరోజు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు ని మర్యాదపూర్వకంగా వారి కార్యాలయంలో కలిసి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది.ఈ సందర్భంగా వడ్డేపల్లి రాజేశ్వరరావు వేణుగోపాల్ ని శాలువాతో సన్మానించి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. పార్టీ కోసం నిరంతరం పనిచేస్తూ, బాలాజీ నగర్ డివిజన్‌లో బీజేపీ బలోపేతానికి వేణుగోపాల్ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని కొనియాడారు.
అనంతరం వేణుగోపాల్ జనవరి 23వ తేదీన కేపీహెచ్బీలో నిర్వహించనున్న మహానీయుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొనవలసిందిగా వడ్డేపల్లి రాజేశ్వరరావు ని ఆహ్వానించారు.“నేతాజీ సుభాష్ చంద్రబోస్ భారత స్వాతంత్ర్య సంగ్రామానికి ప్రేరణనిచ్చిన మహానీయుడు. అలాంటి మహనీయుని విగ్రహావిష్కరణ కార్యక్రమం కేపీహెచ్బీ లో జరగడం గర్వకారణం. పార్టీ కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి” అని రాజేశ్వరరావు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో గాలిఅనిత, నాగేశ్వర్ గుప్తా, తాండూర్ సునీత తదితరులు పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.



