Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ జనవరి 21 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955

ఏర్పాటు చేసిన ఎడ్ల బండలాగుడు పోటీల్లో విజేతలకు బహుమతులు అందించిన నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం.

సోమవారం రాత్రి 8 గంటలకు జరిగిన పోటీల్లో మాజీ మంత్రి చిలకలూరిపేట ఎమ్మెల్యే తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత ప్రత్తిపాటి పుల్లారావు ఆహ్వానం మేరకు కార్యక్రమంలో పాల్గొన్న నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ దేశం మొత్తం మూడు రోజులు సంక్రాంతి జరుపుకుంటున్న సమయంలో చిలకలూరిపేటలో మాత్రం పది రోజులు సంక్రాంతి పండుగ జరిపిన ఘనత ప్రత్తిపాటి పుల్లారావు కే దక్కిందని అన్నారు. రైతులకు ఏర్పాటు చేసిన ఎద్దుల పోటీలు జాతీయ స్థాయిలో కొనసాగటం గర్వకారణం అన్నారు. కార్యక్రమంలో మంత్రి కొలుసు పార్ధసారధి, నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు, తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్,నెల్లూరి సదా శివరావు, కందిమళ్ళ అంజిబాబు, మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ, చిలకలూరిపేట యార్డ్ ఛైర్మన్ షేక్ కరీముల్లా, మురకొండ మల్లి బాబు, పిల్లి లెనిన్, పిల్లి కోటి, జంగా వినాయక రావు,తేలప్రోలు వీరయ్య చౌదరి, షేక్ జరినా సుల్తానా, పోపూరి లక్ష్మి, బత్తినేని శ్రీనివాసరావు, తోట బ్రహ్మస్వాములు, తోట సత్యం, బైరా శ్రీనివాసరావు,మద్దుమాల రవి, అమరా రమాదేవి, చెన్నంశెట్టి పద్మావతి,తెళ్ళ సుబ్బారావు, అరె మల్లికార్జున రావు, బీజేపీ నేత పులుగుజ్జు మహేష్ తదితరులు పాల్గొన్నారు.