Listen to this article

మండల విద్యాధికారి పి.విట్టల్

జనం న్యూస్ జనవరి 20 చిలిపి చెడు మండల ప్రతినిధి

మెదక్ జిల్లా చిలిపి చెడు మండలంలో

ఉదయం 11:40 గంటలకు కే జి బి వి చిట్కుల్ పాఠశాలను మండల విద్యాధికారి పి .విటల్ చండూరుకాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు డి .రమేష్ గారితో కలిసి కేజీబీవీ పాఠశాలను సందర్శించి ఉపాధ్యాయ సమావేశం నిర్వహించడం జరిగింది .ఈ సమావేశంలో మన జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం పదవ తరగతి విద్యార్థుల పరీక్షలపై మరియు ఇంటర్మీడియట్ విద్యార్థుల పరీక్షలపై ,పాఠశాల విద్యా ప్రణాళికపై మరియు దాని అమలుపై చర్చ జరిగింది.పదవ తరగతిలో విద్యార్థులందరూ 100% ఫలితాలు సాధించడం, గరిష్ట మార్కులు పొందడం.అన్ని విషయాలలో విద్యార్థులు మంచి ఫలితాలు సాధించేలా దృష్టి పెట్టాలని సూచించారు. విద్యార్థుల హాజరు 100% ఉండేలా చూడాలని చెప్పారు.2026 జనవరి చివరికి ఎస్ ఎస్ సి సిలబస్ పూర్తి చేయాలని తెలియజేయడం జరిగింది .2026 మార్చి ఎస్ ఎస్ సికోసం వ్యక్తిగత అధ్యయన పరూపొందించాలని చెప్పారు.ఎస్ ఎస్ సి విద్యార్థులకు ప్రశ్నాపత్ర నమూనా పేపర్ మోడల్ అవగాహన కల్పించి, మరిన్ని ప్రాక్టీస్ పరీక్షలు నిర్వహించాలని చెప్పారు.మండలంలోని అన్ని పాఠశాలలు ప్రతి విషయంపై టాప్ టెన్ ఫలితాలు సాధించేలా కృషి చేయాలని, నిరంతర మానిటరింగ్ చేయాలని సూచించారు.అదేవిధంగా ఇంటర్మీడియట్ విద్యార్థులు కూడా మన చిలిపిచేడు మండలాన్ని ఫలితాలలో అత్యున్నత స్థానం వచ్చే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని తెలియజేయడం జరిగింది .ఈ సమావేశంలో మండల విద్యాధికారి ,కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు ,పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, ఉపాధ్యాయునులు పాల్గొన్నారు .