సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ జనం న్యూస్ బి వీరేశం జనవరి 20
..
డాక్టర్ పైడి ఎల్లారెడ్డి గారు జహీరాబాద్ మున్సిపల్ ఎన్నికల ప్రబారీగా బిజెపి రాష్ట్ర అధ్యక్షులు సూచన మేరకు బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తూళ్ళ వీరేందర్ గౌడ్ గారు నియామక ఉత్తర్వుని జారీ చేశారు.,
ఇంతకుముందు డాక్టర్ పైడి ఎల్లారెడ్డి గారు విద్యార్థి దశలోని జాతీయ విద్యార్థి సంఘం ( ABVP) ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి ఎన్నికల్లో యూనివర్సిటీ కార్యదర్శిగా 1980 దశకంలో పోటీచేసి గెలుపొందారు..
అనేక సంవత్సరాలు జపాన్ లో సైంటిస్ట్ గా పనిచేసి మాతృభూమి పై మమకారంతో మళ్లీ భారత దేశంలో స్థిరపడ్డారు..అనంతరం భారత ప్రధాని మోడీ గారి నాయకత్వానికి ఆకర్షితులై బిజెపిలో చేరి అంచలంచలుగా ఎదిగి ప్రస్తుతం బిజెపి రాష్ట్ర నాయకులుగా ఎల్లారెడ్డి నియోజకవర్గ బాధ్యతలు చూస్తున్నారు



