జనం న్యూస్. తర్లుపాడు మండలం. జనవరి 20
తర్లుపాడు మండలం సీతానాగులవరం మరియు సూరేపల్లి లో మండల వ్యవసాయ అధికారి పి జోష్నాదేవి నిర్వహించారు. ఖరీఫ్ కంది పంట కోటదశలో ఉన్నందున, పంట దిగుబడి కూడా ఆశాజనకంగా ఉన్నట్లు రైతులకు తెలిపారు. కావున రైతులు ప్రభుత్వం వారు కందుల కొనుగోలు కేంద్రంలో కనీస మద్దతు ధర రూ 8000 లకు ఈ. పంట లో నమోదు చేసుకున్న వారు అమ్ముకోవాలని తెలియజేశారు.దళారులకు తక్కువ ధరకు అమ్ముకొని నష్టపోవద్దని వారికి తెలిపారు. పప్పుసనగ కొనుగోలు కేంద్రం సీతానాగులవరం రైతు సేవ కేంద్రం పరిధిలో ఓపెన్ చేయాలని రైతులు మండల వ్యవసాయ అధికారి వారికి వారి అభ్యర్థనను పై అధికారులకు తెలియజేయాలని కోరారు. అనంతరం రైతులు సాగుచేసిన తెలబర్లీ , వరిగ పొలాలను సందర్శించారు. కార్యక్రమంలో ఏఈఓ దేవేంద్ర గౌడ్, విఏఏ జిలానీ,ప్రకృతి వ్యవసాయ సిబ్బంది మేరీమని , రైతులు పాల్గొన్నారు.



