జనం న్యూస్. తర్లుపాడు మండలం. జనవరి 20
జాతీయ ఓటర్ల దినోత్సవాన్నిపురస్కరించుకుని, తర్లుపాడు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం నాడు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తర్లుపాడు మండల తహసీల్దార్ కే.కే. కిషోర్ కుమార్ హాజరయ్యారు.ఈ సందర్భంగా విద్యార్థులకు ఓటు హక్కు దాని ప్రాముఖ్యత అనే అంశంపై వ్యాసరచన పోటీలను నిర్వహించారు.ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం లాంటిదని, ప్రతి ఒక్కరూ తమఓటుహక్కునువినియోగించుకోవాలని తహసీల్దార్ విద్యార్థులకు సూచించారు. అనంతరం వ్యాసరచన పోటీలలో ప్రతిభ కనబరిచి, రాణించిన విద్యార్థులకు తహసీల్దార్.చేతులమీదుగాబహుమతులనుఅందజేశారు.ఈకార్యక్రమంలోపాఠశాలప్రధానోపాధ్యాయులు ఎం. సుధాకర్, సీనియర్ అసిస్టెంట్ లక్ష్మి రెడ్డి, వెల్ఫేర్ అసిస్టెంట్ సుధీర్, మహిళా కానిస్టేబుల్ రాజేశ్వరి, వి.ఆర్.ఏ చల్లగాలి చెన్నయ్య, సి.ఓ విష్ణు తదితరులు పాల్గొన్నారు.


