Listen to this article

జనం న్యూస్ 21 జనవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్


యస్ బి ఐ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చెన్నిపాడు ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి…పోతులపాడు లో కర్నల్ సంతోష్ పేరుతో ఉచిత ఆర్మీ కోచింగ్ సెంటర్ ఏర్పాటు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన ఏఐసీసీ కార్యదర్శి అలంపూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్.ఎస్.ఏ.సంపత్ కుమార్ నాగర్ కర్నూల్ పార్లమెంటు సభ్యులు ఎంపీ మల్లు రవి అలంపూర్ నియోజక వర్గం మానవపాడు మండలం చెన్నిపాడు, పోతులాపాడు గ్రామలలో పోతులపాడు గ్రామ వాసి చల్ల శ్రీనివాస్ శెట్టి యస్ బి ఐ చైర్మెన్ యస్ బి ఐ ఫౌండేషన్ మరియు భవిష్య భారత్, గ్రామ సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో వారి స్వగ్రామం లో ఉన్న ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి కొరకు ప్రత్యేక ఫండ్ ద్వారా అభివృధి పనులను చేయించడం జరిగింది.ఈ సందర్భంగా చల్ల శ్రీనివాస్ శెట్టి చిన్నపోతులపాడు .
పెద్ద పోతులపాడు చెన్నిపాడు గోకులపాడు బొంకూరు గ్రామాల నీ దత్తత తీసుకుని అభివృద్ధి చేయడం జరిగింది అందులో భాగంగ పోతులపాడు లో ఉచిత ఆర్మీ కోచింగ్ సెంటర్,స్టడీ హాల్ మరియు స్మార్ట్ క్లాస్ రూమ్ ,డైనింగ్ హాల్ రిపేర్ ,విద్యార్థులకు ఉచిత సైకిళ్లు, వాటర్ ప్లాంట్ లాంటి వసతులు అందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి తో పాటు ఏఐసీసీ కార్యదర్శి అలంపూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎస్ ఏ సంపత్ కుమార్ , అలంపూర్ మార్కెట్ కమిటీ చైర్మెన్ దొడ్డప్ప , వైస్ చైర్మెన్ కుమార్ , గ్రంథాలయ చైర్మెన్ నీలి శ్రీనివాస్ , యస్ బి ఐ బ్యాంకు ఉన్నతాధికారులు, యస్ బి ఐ ఫౌండేషన్ సభ్యులు, మండల అధ్యక్షులు జగన్ మోహన్ గౌడ్, ఆయా గ్రామాల సర్పంచులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.