జనం న్యూస్: జనవరి 21(రిపోర్టర్:కొత్తమాసు అజయ్ కుమార్, యర్రగొండపాలెం, మార్కాపురం జిల్లా)
మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఎర్రగొండపాలెం మండల విశ్వబ్రాహ్మణ సంఘ కార్యాలయంలో రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం ఉపాధ్యక్షులు మరియు సీనియర్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి ముత్తలూరి మల్లికార్జున చారి మాట్లాడుతూ ఉమ్మడి మద్రాస్ రాష్ట్ర శాసనమండలి సభ్యులు విశ్వబ్రాహ్మణులను బీసీ కులం గా గుర్తించినందుకు పాటుబడిన మహాన్యుడు శ్రీ గానాల రామ్మూర్తి అని అన్నారు ఆయన ఆదర్శంగా తీసుకొని సంఘ పూర్వ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో మండల విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు జమ్మోజు వెంకటేశ్వర చారి ఉపాధ్యక్షులు లింగాల సత్యనారాయణ చారి రంగోజు మల్లికార్జున చారి గుంటూరు సత్యనారాయణ చారి జమ్మూజు సుబ్రహ్మణ్యం రాచర్ల అల్లూరయ్య చారి లింగాల వీరనాగ చారి బెజవాడ పరమేశ్వర చారి బొద్దోజు శ్రీను తదితర సంఘ నాయకులు మండల సంఘం నాయకులు పాల్గొన్నారు.


