మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు మహానంద,
జనం న్యూస్,జనవరి 21,కంగ్టి,
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని తడ్కల్ గ్రామంలోని ఉర్దూ మీడియం పాఠశాలలో గ్రామ స్వరాజ్ సంస్థ ఆధ్వర్యంలో కుట్టు మిషన్ శిక్షణ పొందిన మహిళలకు బుధవారం మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు మహానంద, గ్రామ పెద్దలతో కలిసి శిక్షణ పత్రాలను మహిళలకు అందజేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళలు తమ కుటుంబానికి పోషించుకునే కొరకై తమ కాళ్ళపై తాము నిలబడే కొరకై ప్రభుత్వం శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు.గతంలో కుట్టు మిషన్ శిక్షణ పొందిన 40 మంది మహిళలకు శిక్షణ పత్రాలను అందజేసినట్లు తెలిపారు.శిక్షణ పొందాలనుకున్న మహిళలు గ్రామంలోని సిఏలకు వివో లీడర్లకు సంప్రదించి తమ పేరును నమోదు చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్,గ్రామ సర్పంచ్ భర్త వై మల్లారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు కోటగిరి మనోహర్,డాక్టర్ హమీద్,ముల్తాని బాబు సాబ్,సిఏ సవిత,వివో లీడర్ గంగామణి, శిక్షణ పొందిన మహిళలు తదితరులు పాల్గొన్నారు.


