Listen to this article

జనం న్యూస్ జనవరి 21 2026(ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రీపోటర్ )

రైతుల సమస్యల పరిష్కారానికి విశేషంగా తమ వంతు కృషి చేస్తున్న టీఆర్ఆర్ఎస్( తెలంగాణ రైతు రక్షణ సమితి) ను హనుమకొండ జిల్లా అడిషనల్ కలెక్టర్ ఎన్ .రవికుమార్ అభినందించారు. బుధవారం రైతు రక్షణ సమితి నాయకులతో కలిసి ఆయన ఆఫీసులో రైతు రక్షణ సమితి ఆధ్వర్యంలో రూపొందించిన -2026 క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు రక్షణ సమితి ఉమ్మడి కరీంనగర్, హనుమకొండ జిల్లా అధ్యక్షుడు భాస్కర్ హింగే, హనుమకొండ జిల్లా ఉపాధ్యక్షుడు హింగే రవీందర్, జిల్లా సహాయ కార్యదర్శి అంబీరు శ్రీనివాస్, ఎల్కతుర్తి మండల ప్రధాన కార్యదర్శి కె మాధవరావు, పరకాల అధ్యక్షుడు మధుకర్ పాల్గొన్నారు.