బిచ్కుంద జనవరి 21 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రానికి చెందిన ప్రముఖ వైద్యుడు డాక్టర్ బుక్కవార్ సంజీవ కొద్ది రోజుల క్రితం గుండెపోటుతో మృతి చెందారు…ఈ విషయం తెలుసుకున్న జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు బుధవారం రోజు వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు..ఒక వైద్య సేవకుడు అకాల మరణం చెందడం అత్యంత బాధాకరమని, డాక్టర్ సంజీవ సమాజానికి చేసిన సేవలు ఎప్పటికీ మరువలేనివని ఎమ్మెల్యే పేర్కొన్నారు..వారి కుటుంబానికి ముఖ్యంగా పిల్లల భవిష్యత్తు విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా తాను ఎప్పుడూ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యే తో పాటు తోపాటు డెలికేట్ విట్టల్ రెడ్డి బిచ్కుంద మండల పార్టీ అధ్యక్షుడు గంగాధర్ పట్టణ అధ్యక్షుడు సాయిల్ సెట్ కార్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నాగనాథ్ పటేల్ నాగరాజ్ ఖలీల్ సోపాన్ సార్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు



