జనం న్యూస్ 22 జనవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్
జిల్లాలోని యస్ సి కళాశాల వసతి గృహాలలో పని చేస్తున్న క్యాటరింగ్ కార్మికులకు 17 నెలల పెండింగ్ వేతనాలు వెంటనే ఇవ్వాలని సిఐటీయూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఉప్పేర్ నరసింహ, వీవీ నరసింహ డిమాండ్ చేశారు. బుధవారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారి నుషిత కి వినతిపత్రం అందించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా కేంద్రంలోని యస్ సి బాలుర, బాలికల కళాశాల వసతి గృహాలలో పని చేస్తున్న క్యాటరింగ్ కార్మికులకు 17 నెలలుగా వేతనాలు పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు.ఇచ్చే అతి తక్కువ వేతనాలు సైతం నెలల తరబడి పెండింగ్ లో ఉంచడం సరైంది కాదన్నారు.వేతనాలు రాక కార్మికులు అప్పుల బాధతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురి అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.కార్మికులకు నెల నెల సక్రమంగా వేతనాలు ఇవ్వకపోవడం వల్ల తమకు వచ్చే వేతనం సైతం ఎంతో తెలియని గందరగోళ పరిస్థితి ఏర్పడిందని అన్నారు.వేతనాలు రాకపోవడానికి సాంకేతిక కారణాల లేదా అధికార యంత్రాంగ తప్పిదమా తేల్చి, తక్షణమే చర్యలు చేపట్టాలని కోరారు.కార్మికులకు వేతనాలు నెలనెల ఇవ్వకున్నా సెలవులు లేకుండా అవిశ్రాంతంగా పనిచేస్తున్నారని తెలిపారు.విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా కార్మికులను నియమించకపోవడం వల్ల,కార్మికులు బహుళ పనులు సైతం చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.కార్మికుల ఖాతాలో పీఎఫ్ సైతం సక్రమంగా జమ కావడం లేదని అన్నారు. కావున తక్షణమే పెండింగ్ లో ఉన్న వేతనాలు ఇవ్వాలని,కార్మికుల ఖాతాలో పీఎఫ్ నెల నెల జమ చేయడంతో పాటు,విత్ డ్రా లో వచ్చే ఇబ్బందులు పరిష్కారించాలని, నెల నెల సక్రమంగా వేతనాలు అందజేసే విధంగా చర్యలు తీసుకోవాలని,సంవత్సరాల తరబడి వసతి గృహ విద్యార్థులకు సేవ చేస్తున్న వీరిని ఔట్సోర్సింగ్ కార్మికులుగా గుర్తించి వేతనాలు అందజేయాలని పీఎఫ్, ఈఎస్ఐ అందజేసి, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు.ఈ కార్యక్రమంలో వసతి గృహ కార్మికులు శశికళ, హైమవతి సరస్వతి రామేశ్వరమ్మ పార్వతమ్మ, జయమ్మ పాల్గొన్నారు.ధన్యవాదాలతో ఉప్పేర్ నరసింహ సిఐటీయూ జిల్లా అధ్యక్షుడు జోగులాంబ గద్వాల జిల్లా


