Listen to this article

జనం న్యూస్ జనవరి: నిజామాబాద్ జిల్లా

ఏర్గట్లమండలం కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు పి ఎం శ్రీ పథకం కింద మంజూరైన నిధులతో ప్రభుత్వ ఆదేశాల మేరకు బుధవారం నాగార్జునకొండ మ్యూజియాన్ని సందర్శించారు.
చరిత్ర, పురావస్తు సంపదపై విద్యార్థుల్లో అవగాహన పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ అధ్యయన పర్యటనను నిర్వహించినట్లు ప్రధానోపాధ్యాయులు కొమరగిరి కృష్ణ చారి తెలిపారు.నాగార్జునసాగర్ జలాశయంలోని నాగార్జునకొండ ద్వీపంపై ఏర్పాటు చేసిన మ్యూజియంలో బౌద్ధ శిల్పాలు, శాసనాలు, విహారాలు, స్తూప అవశేషాలను విద్యార్థులు ఆసక్తిగా పరిశీలించారు.ఈ కార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ నాగరాణి గారు, అలాగే ఉపాధ్యాయులు మునురుద్దీన్, ప్రసాద్, రాజశేఖర్, సబ్బాన్ శ్రీనివాసులు, విజయకుమార్, రాజేందర్, రాజ నరసయ్య, గంగాధర్, ప్రవీణ్ శర్మ, ట్రింకిల్ కుమార్, నరేష్, గంగమోహన్ తదితరులు పాల్గొన్నారు.