Listen to this article

జనం న్యూస్:జనవరి 22 (రిపోర్టర్:కొత్తమాసు అజయ్ కుమార్, యర్రగొండపాలెం, మార్కాపురం జిల్లా)
ఉద్యోగుల జీతాలు వాడుకున్నాడా?

మనీ లాండరింగ్ కేసులో TV9 మాజీ సీఈవో రవి ప్రకాష్‌కు ఈడీ షాక్.

టీవీ9 సీఈవోగా ఉన్న సమయంలో ఉద్యోగుల జీతాలకు సంబంధించిన రూ.18 కోట్లకు పైగా డబ్బులను కంపెనీ ఖాతా నుంచి విత్ డ్రా చేసారని, వాటికి లెక్కలు చూపలేదని రవి ప్రకాష్‌పై ఈడీ మనీ లాండరింగ్ కేసు నమోదు.అయితే తనపై నమోదైన కేసులో ఈడీ విచారణకు హాజరుకాకుండా రవి ప్రకాశ్ తప్పించుకుని తిరుగుతున్నాడనే కారణంతో మరో కేసు నమోదు చేసిన ఈడీ.ఈ కేసుపై విచారణ జరిపి రవి ప్రకాష్‌ను ముద్దాయిగా గుర్తిస్తూ రూ.1,000 ఫైన్ విధించిన సెషన్స్ కోర్టు.ఫైన్ చెల్లించని పక్షంలో వారం రోజుల జైలు శిక్ష ఉంటుందని స్పష్టం చేసిన కోర్టు.