బిచ్కుంద మున్సిపాలిటీపై కాషాయం జెండా ఎగురవేయాలి మాజీ ఎంపీ బీబీ పాటిల్
బిచ్కుంద జనవరి 22 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మున్సిపాలిటీ ఎలక్షన్ సన్నాహక సమావేశం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ పంపించిన మాజీ ఎమ్మెల్యే ఎండాల లక్ష్మీనారాయణ బిచ్కుంద మున్సిపాలి ఇంచార్జిగా రావడం జరిగింది. విశిష్ట అతిథిగా జైరాబాద్ మాజీ పార్లమెంట్ సభ్యులు బీబీ పటేల్ . కామారెడ్డి జిల్లా ఇన్చార్జి విక్రం రెడ్డి , జిల్లా అధ్యక్షులు నీలం చిన్న రాజులు మాట్లాడుతూ బిచ్కుంద మున్సిపాలిటీ ఆఫీస్ పైన కాషా జండా ఎగరవేయాలని కచ్చితంగా చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవాలని అందరూ కలిసిమెలిసి పనిచేయాలని బూత్ స్థాయి నుంచి కార్యకర్తలు అందరూ మోడీ గారి కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు తెలియజేయాలని చెప్పడం జరిగింది. ఈ సన్నాక కార్యక్రమం బిచ్కుంద బిజెపి మండల పార్టీ అధ్యక్షులు శెట్పల్లి విష్ణు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జుక్కల్ మాజీ ఎమ్మెల్యే అరుణతార , కిష్టారెడ్డి, జాదవ్ పండరి, మంచి సిద్ధం సెట్, ముత్యం పిరాజి, గాండ్ల భాస్కర్, సురేష్, ఆర్తి, గీతంజలి తదితరులు పాల్గొన్నారు*




