Listen to this article

జనం న్యూస్ నందలూరు కడప జిల్లా.

నందలూరు మండలం టంగుటూరు గ్రామంలో శ్రీ వినాయక క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ కు ముఖ్య అతిథులుగా టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేవూరి వేణుగోపాల్, సింగిల్ విండో అధ్యక్షులు పసుపులేటి ప్రవీణ్ కుమార్,మండల కో క్లస్టర్ ఇంచార్జ్ చుక్క యానాది, టంగుటూరు సర్పంచ్ మొయినుద్దీన్, లు పాల్గొన్నారు ఫైనల్ కు టంగుటూరు జట్టు, సాతపల్లి జట్టు వచ్చాయి ఫైనల్ మ్యాచ్లో టంగుటూరు జట్టు విజయం సాధించగా సాతపల్లి జట్టు రన్నర్స్ గా నిలిచింది. ఈ సందర్భంగా మొదటి బహు మతి 20వేల రూపాయలను టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేవూరి వేణుగోపాల్ అందజేశారు రెండో బహుమతి 15000 రూపాయలను చుక్క యానాది టిడిపి మండల కో క్లస్టర్ ఇంచార్జ్ అందజేశారు, విజేతలకుట్రోపీనిఅందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలు వైపు వెళ్లకుండా క్రీడలను ఏర్పాటు చేయడం అభినంద నీయమని కమిటి నిర్వహణ నిర్వాహకులను అభినందిం చారు.క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంచుతాయని శరీరం దృఢంగా ఏర్పడు తుందని అన్నారు.గెలుపు ఓటములు సమానంగాతీసుకోవాలన్నారు .ప్రభుత్వం క్రీడలకు ప్రత్యేక గుర్తింపు ఇస్తుందని రాష్ట్రంలో క్రీడలను ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు,ప్రోత్సహిస్తున్నారని అన్నారు .ఈ టోర్నీలో పాల్గొన్నవారు ఆర్గనైజర్లు తదితరులు పాల్గొన్నారు