Listen to this article

జనం న్యూస్ జనవరి 22 2026 (ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రీపోటర్ )

ఎల్కతుర్తి మండలం పెంచికల్పేట గ్రామానికిz1 చెందిన పూజారి నాగిళ్ల వెంకటేశ్వర్లు తన కుమారులు సాదడం లేదని తనకున్న వ్యవసాయ భూమిని గ్రామపంచాయతీకి రాసిస్తున్నట్లు గ్రామస్తుల సమక్షంలో సంతకం చేసి కాపీని ప్రజలందరికీ అందించారు. వివరాల్లోకి వెళితే పూజారి నాగిళ్ల వెంకటేశ్వర్లు తండ్రి కోనయ్యను భీమదేవరపల్లి మండలం కొప్పూరు నుంచి గ్రామస్తులు గత కొన్ని ఏళ్ల క్రితం పురోహితం చేయడానికి గ్రామానికి తీసుకొచ్చి 4.38 ఎకరాల భూమిని జీవనోపాధి కోసం అప్పగించారు. అప్పటినుండి అతని కుమారుడైన వెంకటేశ్వర్లు గ్రామంలో పురోహితం చేసుకుంటూ భూమిని సాగు చేసుకుంటున్నాడు. వెంకటేశ్వర్లుకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె కలరు. ఇందులో చిన్న కుమారుడైన కోటేష్ తనకు, భూమికి గ్రామానికి సంబంధం లేదని వేరే దగ్గర పురోహితం చేసుకుంటున్నాడు. అయితే వెంకటేశ్వర్లు తన పిల్లలు ఎవరు వృద్ధాప్యంలో సాదడం లేదని ఆరోపిస్తున్నాడు. గ్రామస్తులే తన బాగోగులు చూసుకుంటున్నారని తెలిపాడు. అందుకే ఈ భూమి మొత్తం గ్రామపంచాయతీకి అప్పగిస్తానని గ్రామస్తులందరి సమక్షంలో గురువారం గ్రామ ప్రజలకు గ్రామపంచాయతీ లెటర్ ప్యాడ్ పై భూమి అప్పగింత హామీ పత్రాన్ని రాసిచ్చాడు. కాగా పూజారి వెంకటేశ్వర్లు నిర్ణయం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.