జనం న్యూస్ 22 జనవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
విజయనగరం ఆర్ టీ సీ డిపోలో పనిచేస్తున్న బస్సు డ్రైవర్లకు డి ఎస్ పి ఆర్.గోవిందరావు గురువారం రోడ్డు ప్రమాదాలు నివారణపై అవగాహన కల్పించారు. జిల్లాలో రహదారి ప్రమాదాలు తగ్గించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. డ్రైవర్లు అతివేగం, నిర్లక్ష్య డ్రైవింగ్, మద్యం తాగి వాహనాలు నడపడం వంటి వాటికి దూరంగా ఉండాలని హితవు పలికారు. రహదారి భద్రతా ప్రమాణాలు పాటించాలని కోరారు.


