జనం న్యూస్ జనవరి 23 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి
టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్, కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ బండి రమేష్ పదిహేను రోజుల క్రితం గోపాలనగర్లో పర్యటించి, గోపాలనగర్ కాలనీ సమస్యల పరిష్కారంలో భాగంగా పార్కులపై జరుగుతున్న కబ్జాలను గుర్తించడం జరిగింది.ఈ విషయమై లేదు దాని గురించి హైడ్రా కమిషనర్ తో మాట్లాడి, తగిన విధంగా చర్యలు చేపట్టేందుకు కృషి చేశారు. ఆ కృషికి ఫలితంగా ఈరోజు గోపాలనగర్లోని పార్కు స్థలాలను ఖజ్జాల నుంచి విడిపించే చర్యలు విజయవంతంగా చేపట్టడం జరిగింది.ఈ సందర్భంగా టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ బండి రమేష్ కి, మరియు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి, అలాగే హైడ్రా కమిషనర్ రంగనాథ్ కి ప్రత్యేకమైన కృతజ్ఞతలు మరియు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
గత పదేళ్లుగా ఖజ్జాలకు గురైన కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను గుర్తించి, వాటిని ఖజ్జాల నుంచి విముక్తం చేసి ప్రజా వినియోగార్థం కాపాడే దిశగా ఈ చర్యలు చేపట్టడం జరిగింది. ప్రజలకు అవసరమైన పార్కులు తదితర సదుపాయాల కోసం ఈ భూములను ఉపయోగించాలనే లక్ష్యంతో హైడ్రా రంగంలోకి దిగి సమర్థవంతమైన చర్యలు తీసుకున్నారు.ఈ కార్యక్రమం గోపాలనగర్లో విజయవంతంగా నిర్వహించబడింది. ఇందుకు హైడ్రా అధికారులు, కాంగ్రెస్ నాయకులు తీసుకున్న చర్యలకు హృదయపూర్వక ధన్యవాదాలు.అలాగే ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన అడ్వకేట్ సంఘసంస్కర్త రాధాకృష్ణ కి ప్రత్యేకమైన ధన్యవాదాలు. స్థానిక ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, లోకల్ నాయకులు ప్రతి ఒక్కరికీ పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.ధన్యవాదాలు.



