డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్ 23 జనవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్
కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన అవినీతి ఆరోపణలు వచ్చినపుడల్లా కమీషన్ లు సిట్ విచారణల తో అక్రమ కేసులు బనాయిస్తున్నారు..సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో ఒడిస్సా లోని నైని బొగ్గు బ్లాక్ కోసం జరిగిన టెండర్లలో జరిగిన అవకతవకలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత బావమరిది సృజన్ రెడ్డి చేసిన స్కామ్ పై ఆధారాలతో సహా మొన్న మాజీ మంత్రి హరీష్ రావు బయట పెట్టిన కొన్ని గంటల్లోనే సిట్ నోటీసులు ఇచ్చారు.నేడు బి ఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఒత్తిడి మేరకు కేంద్రప్రభుత్వం కమిటీ వేసి విచారణ జరపాలని నిర్ణయం తీసుకున్న తర్వాత అటెన్షన్ డైవర్షన్ లో భాగంగా నేడు కేటీఆర్ కి సిట్ నోటీసులు ఇచ్చింది..గడిచిన రెండు సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అవినీతి అక్రమాలపై బి ఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనేక పోరాటాలు చేశారు..రేవంత్ రెడ్డి అల్లుడి ఫార్మా కంపెనీకి లగచర్ల గిరిజన రైతుల భూములు లాక్కునేందుకు రేవంత్ రెడ్డి కుట్ర చేస్తే కొడంగల్ రైతులకు మద్దతుగా పోరాడిన నాయకుడు కేటీఆర్.మూసీ నదీ సుందరీకరణ పేరుతో 1 లక్ష 50 వేల కోట్ల దోపిడీకి కుట్ర చేస్తే కేటీఆర్ రేవంత్ రెడ్డి దోపిడీని అడ్డుకున్నారు.రేవంత్ బావమరిది సృజన్ రెడ్డి అమృత్ టెండర్ల లో 1137 కోట్ల కుంభకోణం చేశారు అని కేటీఆర్ అన్ని ఆధారాలతో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కి పిర్యాదు చేస్తే అప్పుడు ఫార్ములా ఈ కార్ రేస్ కేసును ఏసీబీ విచారణ పేరుతో రేవంత్ రెడ్డి కేటీఆర్ పై కేసులు పెట్టారు.సివిల్సప్లయ్ కేసులో 1000 కోట్ల అవినీతి జరిగిందని ఆధారాలతో సహా బయటపెట్టారు..
ఇన్ని అవినీతి అక్రమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన కాంగ్రెస్ ప్రభుత్వం తట్టుకోలేక కక్షపూరితంగా తప్పుడు కేసులు పెడుతూ 6 గ్యారెంటీలను 420 హామీలను అమలు చేయలేక ప్రజల దృష్టిని మరల్చడానికి కాళేశ్వరం కమీషన్,విద్యుత్ కమీషన్,ఫార్ములా ఈకార్ కేసు,ఫోన్ ట్యాపింగ్ కేసు కేసీఆర్ పై,కేటీఆర్ పై,హరీష్ రావు పై అక్రమ కేసులు పెట్టి ప్రజల దృష్టిని మళ్లించి రాబోయే మున్సిపల్ ఎన్నికలలో లబ్ధి పొందాలని చూస్తున్నారు..ఎన్ని కేసులు పెట్టినా బి ఆర్ ఎస్ పార్టీని ఎన్ని ఇబ్బందులు పెట్టాలని చూసినా బి ఆర్ ఎస్ పార్టీ మీరు ఇచ్చిన హామీలు అమలు చేసే దాకా పోరాటం చేస్తుంది..డా.కురువ విజయ్ కుమార్ బి ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు


