జనంన్యూస్. 23.శ్రీనివాస్ పటేల్.సిరికొండ.
నిజామాబాదు రురల్ సిరికొండ మండలం లొని గడ్కోల్ గ్రామం లో కారోబార్ గా పనిచేస్తున్న కాసుల.సాయన్న రాజీనామా చెయడంతో అక్కడ కారోబార్ పోస్ట్ కు ఖాళీ ఏర్పడింది. అయితే ప్రస్తుత పాలక వర్గం కొత్త కారోబార్ ను నియమించడానికి లోలోపల తమకు అనుకూలమైన వ్యక్తిని నియమించుకోవడానికి పునుకుంటున్నారని ఇది సరి అయినది కాదని ఆయన పేర్కొన్నారు. ఈ విషయమై స్థానిక ఎంపీడీవోను కలిసిన గాడ్కోల్ గ్రామస్తులు మాస్ లైన్ నాయకులు.. ఇట్టి నియామకానికి నోటిస్ లో ప్రకటించి, ఊరిలో చాటింపు చేసి పాదర్శకంగా నియమించాలని ఆయన డిమాండ్ చేయారు. గ్రామంలో అనేక మంది విద్యవంతులు ఉండగ తమకు నచ్చిన వ్యక్తిని నియమించుకోవాలి చూడడంలో ఆంతర్యం ఏంటో అర్థం కావడం లేదు అన్నారు.గుట్టు చప్పుడు కాకుండా పాలక వర్గం చెస్తున్న లోపాయికరా నియామకం ఏమిటో గ్రామస్తులందరికి అర్థం అవుతుంది అన్నారు. ఇప్పటికైనా గడ్కోల్ లో పాలక వర్గం పాదదర్శకంగా నియమాకం చేయాలి అని ఆయన డిమాండ్ చేయారు.కార్యక్రమం లో సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ గడ్కోల్ గ్రామ కమిటీ నాయకులు బి కిశోర్, ఎం అనిస్, ఎస్ కిశోర్, జి కిరణ్, పి ఎల్లయ్య, ఎస్ కె.రఫిక్ , జి.రాజు తదితరులు పాల్గొన్నారు.


