Listen to this article

జనం న్యూస్. తర్లుపాడు మండలం. జనవరి 23

దేశ స్వాతంత్రం కోసం పోరాడిన మహనీయుడు, ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 129వ జయంతి వేడుకలు తర్లుపాడు మండలం జగన్నాధపురం గ్రామంలో ఘనంగా నిర్వహించారు.స్థానిక మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు కశెట్టి జగన్ బాబు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ప్రధానోపాధ్యాయులు జగన్ బాబు గ నేతాజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. “మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి.. నేను మీకు స్వాతంత్రాన్ని ఇస్తాను” అన్న నినాదంతో యువతలో దేశభక్తిని రగిలించిన గొప్ప వీరుడు నేతాజీ అని కొనియాడారు.విద్యార్థులు నేతాజీ వంటి మహనీయుల జీవిత చరిత్రలను చదివి, వారి క్రమశిక్షణ మరియు దేశభక్తిని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు.దేశాభివృద్ధిలోభాగస్వాములు కావడమే మనం వారికి ఇచ్చే అసలైన నివాళి అని పేర్కొన్నారు.ఈ వేడుకల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని నేతాజీకి జై హింద్ అంటూ నినాదాలు చేశారు.