Listen to this article

జనం న్యూస్ : 23 జనవరి శుక్రవారం; సిద్ధిపేట నియోజిక వర్గ ఇన్చార్జి వై.రమేష్ :

సిద్దిపేట పట్టణంలోని బోధి ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు భాస్కర్ అక్షరాభ్యాసం చేయించారు. అనంతరం పిల్లలకు మిఠాయిలు పంచారు.అక్షరాభ్యాసం చేయించుకున్న విద్యార్థిని, విద్యార్థులకు చక్కగా ప్రవేశం కల్పించి, సరస్వతి మాత ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని చిన్నారులను ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు మరియు పాఠశాల సిబ్బంది పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.