Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955

భరతమాత ముద్దుబిడ్డ సుభాష్ చంద్రబోస్ 128 వ జయంతి సందర్భంగా చిలకలూరిపేట పట్టణంలో భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో ఆ మహనీయుని జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది . ముఖ్య అతిథులుగా బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు, బీజేవైఎం రాష్ట్ర నాయకులు పులుగుజ్జు మహేష్, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు నెల్లూరి ఈశ్వర్ రంజిత్, బిజెపి పట్టణ ప్రధాన కార్యదర్శి సింగరేసు పోలయ్య, ఎడ్లపాడు బిజెపి కార్యదర్శి నక్క దుర్గ తదితరులు పాల్గొన్నారు.కార్యక్రమానికి యువ మోర్చా పట్టణ అధ్యక్షుడు తెల్లబాటి మనోహర్ అధ్యక్షత వహించగా,ఎడ్లపాడు బీజేవైఎం మండల అధ్యక్షులు మల్లా కోటేశ్వరరావు కార్యక్రమం విజయవంతం కావడం కోసం తమ సహకారాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు నక్కా శ్రీనివాసరావు, నాదెళ్ళ యువ నాయకులు తిరుపతయ్యలు పాల్గొన్నారు.