Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ జనవరి 23 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955

చిలకలూరిపేట ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ శ్రీ దత్త సాయి అన్నదాన సమాజం మరియు జయ జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో వేంచేసియున్న శ్రీ దత్త సాయి సన్నిధిలో ఈరోజు సరస్వతీ దేవి చదువుల తల్లి పుట్టినరోజు వసంత పంచమి నీ పురస్కరించుకొని విద్యార్థులచే ప్రత్యేక కుంకుమ పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పండరిపురం కృష్ణవేణి స్కూల్ పదవ తరగతి విద్యార్థులు పూజలో పాల్గొన్నారు, అనంతరం వారికి ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ పూసపాటి బాలాజీ ఫస్ట్ ర్యాంక్ కి వంద సూత్రాలు అనే మోటివేషన్ పుస్తకాన్ని పెన్నులు ప్యాడ్లు ఉచితంగా ట్రస్టు తరుపున పూజ చేసిన పరీక్ష సామాగ్రి అందడం చేయడం జరిగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కూడా పదవ తరగతి చదువుతున్న పబ్లిక్ ఎగ్జామ్స్ రాయపోతున్న తరుణంలో శిరిడిలో ప్రత్యేక పూజలు చేయించి తీసుకుని వచ్చిన పెన్నులు ప్యాడ్లు, విద్యార్థులకు సంబంధించిన పరీక్షా సామాగ్రి ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు, దాతల సహకారంతో ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నామని ఈరోజు వసంతమని పురస్కరించుకొని ఈ కార్యక్రమం మొదలు చేసామని విద్యార్థులకు చదువుకు సంబంధించి ఎటువంటి సహాయ సహకారాలైన దాతల సహకారంతో నిర్వహిస్తామని చదువు అనేది విద్యార్థి జీవితంలో వెలుగు అని చదువుకున్న విద్యార్థి జ్ఞానంతో ప్రవర్తించి తల్లిదండ్రులకు సమాజానికి మంచి పేరు తెస్తారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో స్కూలు ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు