Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 7 రిపోర్టర్ సలికినిడి నాగరాజు : మైనంపాడు గ్రామ రోడ్డు పనులు పరిశీలించి, కాంట్రాక్టర్ కు సూచనలు చేసిన ఎమ్మెల్యే.ప్రజలు మెచ్చుకునేలా, చేసిన అభివృద్ధి గురించి పదికాలాలు చెప్పుకునేలా, ప్రభుత్వానికి సిఎం నారా చంద్రబాబు నాయుడు కి మంచి పేరు వచ్చేలా రోడ్ల నిర్మాణం జరగాలని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు అభిప్రాయపడ్డారు. శుక్రవారం ఆయన చిలకలూరిపేట-నరసరావుపేట ప్రధాన రహదారి నుంచి మైనంపాడు గ్రామానికి వేస్తున్న మెటల్ రోడ్డు పనులను స్వయంగా పరిశీలించారు. పనులకు సంబంధించి కాంట్రాక్టర్ కు పలు సూచనలు చేసిన ఆయన, రోడ్డు వేయడానికి రూ.60లక్షలు మంజూరయ్యాయని, పనుల్లో ఎక్కడా నాణ్యత లోపించకూడదని, పనుల్లో వేగంపెంచి త్వరగా పూర్తిచేయాలన్నారు. నిర్ణీత వ్యవధిలోగా పనులు పూర్తిచేస్తామని కాంట్రాక్టర్, మాజీమంత్రికి తెలిపారు. నరసరావుపేట ప్రధాన రహదారి నుంచి గురుకుల పాఠశాలవరకు రూ.40 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న సీసీరోడ్డు, డ్రైనేజ్ లను కూడా మాజీమంత్రి పరిశీలించారు. పనులు పరిశీలనకు వచ్చిన మాజీమంత్రి వెంట జనసేన ఇంచార్జి తోట రాజా రమేష్, నాదెండ్ల మండలం అధ్యక్షుడు బండరుపల్లి సత్యనారాయణ, వజ్జ సింగయ్య, రామాంజినేయులు, ఇర్లపాడు గ్రామనాయకులు తదితరులు ఉన్నారు.