పట్టణంలోని స్వర్ణకారులకు సంబంధించిన పలు సమస్యల గురించి వివరించిన స్వర్ణకార ప్రతినిధులు
జనం న్యూస్, జనవరి 24, జగిత్యాల జిల్లా, మెట్ పల్లి : పట్టణలోని స్వర్ణకరులు బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ రఘును శుక్రవారం సాయంత్రం మెట్ పల్లి పట్టణ స్వర్ణకార సంఘ ప్రతినిధులు కలిశారు. పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో డాక్టర్ రఘును కలిసి పలు సమస్యలను విన్నవించారు. స్వర్ణకార సంఘానికి సంబంధించి కమిటీ హాలు నిర్మాణానికి ఎంపీ ధర్మపురి అరవింద్ సహకారంతో కృషి చేయాలని కోరారు. తమ సంఘానికి 156 గజాల ఖాళీ స్థలం సిద్ధంగా ఉందని భవన నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు చేయించడానికి సహకరించాలని కోరారు. కొంతమంది పేద స్వర్ణకారులకు సొంత ఇల్లు లేవని, ఏదైన అశుభం జరిగిన సమయాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని డాక్టర్ రఘు దృష్టికి తీసుకువచ్చారు. భవన నిర్మాణానికి రూ.15 లక్షలు ఎంపీ ధర్మపురి అరవింద్ నిధుల కోటా నుండి మంజూరు చేయించడానికి సహకరించాలని కోరారు. ఇందుకు డాక్టర్ రఘు మాట్లాడుతూ ఎంపీ అరవింద్ దృష్టికి సమస్యను తీసుకెళ్లి పరిష్కరించడానికి తన వంతు సహకారాన్ని అందిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్వర్ణకార సంఘ అధ్యక్షుడు వంగల మహేష్, ప్రధాన కార్యదర్శి తొగిటి విద్యాసాగర్, ఉపాధ్యక్షుడు శ్రీపాద సతీష్, సహాయ కార్యదర్శి కలికోట లక్ష్మణ్, మెట్ పల్లి బులియన్ సంఘాల అధ్యక్షులు తొగిటి రమేష్, బెజ్జారపు నవీన్, నాయకులు ఇల్లెందుల కృష్ణమాచారి, బెజ్జారపు మురళి, కోటగిరి తిరుమల్, నాంపల్లి మారుతి, బెజ్జారపు భూమేశ్వర్, బెజ్జారపు రఘు, తునికి చిన్న అంజయ్య, బెజ్జారపు సురేష్, వంగల మహేందర్, దోనోజు వెంకటేష్, ఆకోజీ శ్రీధర్, వేములవాడ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.


