

పాల్గొన్న115 మంది అంతర్జాతీయ బౌద్ధ భిక్షువులు….
జనం న్యూస్- ఫిబ్రవరి 7- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్ : సికింద్రాబాద్ కు చెందిన మహా బోధి బుద్ధ విహార మరియు అంతర్జాతీయ త్రిపీటక సంగాయన మండలి( లైఫ్ ఆఫ్ బుద్ధ దమ్మ పౌండేషన్ ఇంటర్నేషనల్), తెలంగాణ పర్యాటక శాఖ సహకారంతో నాగార్జునసాగర్ లోని బుద్ధవనంలో శుక్రవారం దక్షిణ భారతదేశపు తొలి అంతర్జాతీయ త్రిపీటక పఠనోత్సవం ప్రారంభమైనదని మహా బోధి బుద్ధ విహార సీనియర్ బౌద్ధాచార్యుడు ఆనంద బంతే తెలిపారు. బుద్ధవనం ప్రవేశద్వారం వద్దకు చేరుకున్న వివిధ దేశాల బౌద్ధ బిక్షువులను తెలంగాణ టూరిజం ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికారు. తెలంగాణ సంప్రదాయ ఒగ్గు కళాకారుల నృత్యాలతో, డప్పుల వాయిద్యాలతో బుద్ధుని బొమ్మలతో అలంకరించిన పల్లకితో అశోక ధర్మచక్రం నుండి సాగిన ధర్మ యాత్రలో మన దేశం నుండి 27 మంది, దక్షిణాసియా దేశాలైన శ్రీలంక ,కంబోడియా ,వియత్నాం, థాయిలాండ్ ల నుండి 88 మంది బౌద్ధ భిక్షువులు పాల్గొని స్థూప వనములో నిర్మించిన బౌద్ధ స్మారక స్థూపాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మహాస్తూపం లోపల ఆనంద బంతే ఆధ్వర్యంలో త్రిపీటక పఠణోత్సవ ప్రారంభ సమావేశంలో బుద్ధవనం రూపశిల్పి చెన్నూరు ఆంజనేయ రెడ్డి బౌద్ధ భిక్షువులకు ఆహ్వానం పలికి బుద్ధ వన నిర్మాణ నేపథ్యాన్ని, విశిష్టతలను తెలియజేశారు. ఇటువంటి కార్యక్రమాలని గత 20 ఏళ్లుగా ప్రోత్సహిస్తున్న అంతర్జాతీయ త్రిపీటక పఠణ మండలి వ్యవస్థాపకరాలు వాంగ్ మే డిక్సీ ఈ సందర్భంగా హాజరైన బౌద్ధ భిక్షువులకు బుద్ధ వందనాల తో శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో బుద్ధుని ధర్మ చక్ర ప్రవర్తన సూత్రాన్ని, బుద్ధ వచనాలను వివిధ దేశాల బౌద్ధ భిక్షువులు గానం చేశారు. మధ్యాహ్నం జరిగిన రెండో సమావేశంలో హాజరైన వారిలో సీనియర్ బౌద్ధ భిక్షువులైన ఇట్టకా మహాధర కు గౌరవ వందనాన్ని సమర్పించే కార్యక్రమాన్ని ఆనంద బంతే నిర్వహించారు. అనంతరం ఈ కార్యక్రమానికి హాజరైన తెలంగాణ పర్యాటక శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్ ను మహాబోధి బుద్ధ విహార అధ్యక్షులు కశ్యప బంతే బుద్ధ ప్రతిమను బహుకరించి సత్కరించారు. బుద్ధవనం ఓ ఎస్ డి సుధాన్ రెడ్డి పర్యటక శాఖ కార్యదర్శి కి బుద్ధవనం జ్ఞాపికను బహికరించారు. ఈ సందర్భంగా పర్యాటక శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్ మాట్లాడుతూ బుద్ధ వనంలో ఇటువంటి గొప్ప కార్యక్రమం జరగడ సంతోషకరమైన విషయమని ఇటువంటి కార్యక్రమాల కు తెలంగాణ పర్యటక శాఖ తగు సహాయ సహకారాలు అందిస్తుందన్నారు. అనంతరం వాంగ్ మే డిక్సీ కి బుద్ధవనం జ్ఞాపికను బహుకరించి సత్కరించారు . ఈ కార్యక్రమంలో మహాబోధి బుద్ధ విహార భిక్షువులు బుద్ధ పాల, సంఘ పాల, థాయిలాండ్ కు చెందిన ప్రసుబన్ ఖసియాంగు, ప్రపలాద అమూల్ పోల్మన్, కంబోడియాకు చెందిన ధర్మసిరి, వియత్నాంకు చెందిన హూ య న్ మిన్ దాన్, లావోసుకు చెందిన ఎనాయ్ భౌలాఫిo భిక్షువులు, బ్రెజిల్‌కు చెందిన ఉపాసక నెల్సన్ చమ్మ ఫి లో, బుద్ధ వనం అధికారులు సుధన్ రెడ్డి, ఈమని శివనాగిరెడ్డి, శాసన, రవిచంద్ర, శ్యాంసుందర్‌రావు, పెదవుర తహసిల్దార్ సరోజ పావని, రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, బౌద్ధాభిమానులు, విద్యార్థులు పాల్గొన్నారు.