Listen to this article

జనం న్యూస్ 24 జనవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో, తెలంగాణ జాగృతి సంస్థకు సంబంధించిన నాయకులు, కార్యకర్తలు ఎన్నికల బరిలో నిలవడానికి ఒక ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకున్నారు. ఇప్పటివరకు తెలంగాణ జాగృతికి ప్రత్యేక పార్టీ కామన్ సింబల్ కేటాయింపు జరగకపోవడంతో, పోటీపై స్పష్టత లేకుండా ఉన్న పరిస్థితి నెలకొంది.ఈ నేపథ్యంలో, మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే తెలంగాణ జాగృతి నాయకులు, కార్యకర్తల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని, సంస్థ అధ్యక్షురాలు కవిత అక్క కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆ నిర్ణయం ప్రకారం, రానున్న మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణ జాగృతి తరఫున పోటీ చేసే అభ్యర్థులు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ*కి చెందిన *సింహం గుర్తు పై పోటీ చేయనున్నట్లు తెలిసింది.సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమంతో అనుబంధం కలిగి, జాగృతి వేదికపై పనిచేస్తున్న క్యాడర్‌కు అవకాశాలు దక్కాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారని జాగృతి వర్గాలు తెలిపాయి. కామన్ సింబల్ లేకపోవడం వల్ల కార్యకర్తలు ఎన్నికల పోటీకి దూరమయ్యే పరిస్థితి రాకుండా చూడడమే ప్రధాన లక్ష్యమని వారు పేర్కొన్నారు.ఈ నిర్ణయంతో మున్సిపల్ ఎన్నికల బరిలో తెలంగాణ వాద స్వరం కోనసాగనుందని , స్థానిక ప్రజా సమస్యలపై పోరాటం మరింత బలంగా ఉంటుందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. సింహం గుర్తు ద్వారా పోటీ చేయడం ఉద్యమ ఆలోచనకు భంగం కలిగించదని, ఇది తాత్కాలిక ఏర్పాటుగా భావిస్తున్నట్లు సమాచారం.మున్సిపల్ ఎన్నికల్లో ఈ పరిణామం స్థానిక రాజకీయాల్లో ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాల్సి ఉంది.