బిచ్కుంద జనవరి 24 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలంలోని గ్రామ శివారులలో గుర్తు తెలియని వ్యక్తులు తిరుగుతున్నట్లు అనుమానం వస్తే పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వాలని సబ్ ఇన్స్పెక్టర్ రాజు రైతులకు గ్రామస్తులకు విజ్ఞప్తి చేసినారు. ఎస్సై మాట్లాడుతూ బిచ్కుంద మండల పరిధిలోని పంట పొలాల్లో ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను ఇటీవల రాత్రి వేళల్లో గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసి, వాటిలోని ట్రాన్స్ఫార్మర్ ఆయిల్‌ను దొంగతనం చేస్తున్న సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఈ దొంగతనాల కారణంగా రైతులకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతూ, పంటలకు నష్టం వాటిల్లే పరిస్థితి ఏర్పడుతోంది.ఈ నేపథ్యంలో బిచ్కుంద పోలీస్ శాఖ గ్రామ ప్రజలకు, ముఖ్యంగా రైతులకు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.తమ గ్రామాల్లో అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు లేదా కార్యకలాపాలు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేసింది.సమాచారం ఇవ్వడానికి
డయల్ 100 లేదా బిచ్కుంద పోలీస్ ఎస్సై నంబర్ : 8712686176 ఫోను చేసి సమాచారం ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేసినారు. ప్రజలు రైతులు సహకారంతో ఈ తరహా దొంగతనాలు నివారించవచ్చునని అన్నారు.


