Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ రిపోర్టర్ సలికినీడి నాగు జనవరి 24 సెల్ 9550978955

సరస్వతి యు పి స్కూల్ లో పదవ తరగతి విద్యార్థులకు పరీక్షా సామాగ్రి పంపిణీ మోటివేషన్ పుస్తకాము పంపిణీ చేసిన ట్రస్ట్ చైర్మన్ పూసపాటి బాలాజీ చిలకలూరిపేట ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ శ్రీ దత్త సాయి అన్నదాన సమాజం మరియు జయ జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో ఆరో వార్డులో ఉన్న సరస్వతి యూపీ స్కూల్లో చదువుతున్న 8 9 10వ తరగతి విద్యార్థులకు పరీక్షా సామాగ్రి మరియు మొదటి ర్యాంకుకు 100 సూత్రాలు మోటివేషన్ పుస్తకం ను ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ పూసపాటి బాలాజీ దాతల సహకారతో విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేశారు, ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం 10వ తరగతి విద్యార్థులకు చిలకలూరిపేట నియోజకవర్గం లోనే కాకుండా ఇతర నియోజకవర్గాల్లో కూడా పదవ తరగతి చదివే విద్యార్థులకు కొన్ని హాస్టల్స్ లో కొన్ని స్కూల్స్లో పరీక్షా సామాగ్రి అందజేస్తున్నామని దానితోపాటు ఈ సంవత్సరంలో మోటివేషన్ పుస్తకాలను కూడా అందజేసి విద్యార్థుల పరీక్షల విజయానికి దోహదం చేసే విధంగా ట్రస్టు ప్రణాళికలు రూపొందిస్తుందని దాతల సహకారంతో పరీక్షా సామాగ్రి అందజేస్తున్నామని తెలియజేశారు, తరువాత ట్రస్ట్ చేస్తున్న ఆధ్యాత్మిక సామాజికసేవా కార్యక్రమాలను విద్యార్థులకు వివరించి భవిష్యత్తులో మీ అందరూ కూడా ప్రతి ఒక్కరికి తగిన విధంగా సాయం చేసి మానవసేవయే మాధవసేవ అని నిరూపించాలని ఈరోజు సేవా అనే విత్తనం నాటితే రేపు చెట్టై కొన్ని వందల ఫలాలను ప్రజలకు అందిస్తుందని తెలియజేశారు, ఈ కార్యక్రమంలో సరస్వతి స్కూల్ ఉపాధ్యాయ సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు