Listen to this article

మాజీ ఎస్సీ కార్పొరేటర్ చైర్మన్ వై నరోత్తం

తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 24

అధికారాన్ని అడ్డుపెట్టుకొని కాంగ్రెస్ పార్టీ నాయకులు డైవర్షన్ రాజకీయానికి పాల్పడుతున్నారని మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మెన్ వై.నరోత్తం అన్నారు. శుక్రవారం తన కార్యాల యంలో విలేకరులతో మాట్లాడుతూ.. పాలన చేతగాక రాజకీయ కక్ష సాధింపు చర్యలతో మొన్న హరీష్ రావు కి – నేడు కేటీఆర్కి నోటీస్లు ఇవ్వడం ప్రభుత్వ డైవర్ట్ పాలిటిక్స్ కు నిదర్శనం అన్నారు. ముఖ్యమంత్రి దావోస్ పర్యటన, తెలంగాణ రాష్ట్రంలో మాత్రం సీట్ విచారణలు,అక్రమ అరెస్టులు. నాడు పంచాయతీ ఎన్నికల్లో కేటీఆర్ కు నోటీసులు,నేడు మున్సిపాలిటీ ఎన్నికల్లో హరీష్ రావు,కేటీఆర్కు నోటీసులు. మున్సిపాలిటీ ఎన్నికలను కాంగ్రెస్ సర్కార్ డైవర్ట్ చేస్తుందన్నారు. పాలన గాలికి వదిలి సమస్యల నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికి చేస్తున్న కక్ష సాధింపు రాజకీయాలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. రేవంత్ రెడ్డి విదేశాల్లో విహరిస్తూ, అక్కడి నుండి వచ్చే వరకు తెలంగాణ లో ఈ పనికిమాలిన కేసుతో చెక్కర్లు కొడుతున్నారు. రేవంత్ సర్కారు ఆడించినట్లు పోలీస్ యంత్రాంగం ఆడటం విచారకరమన్నారు. అధికారులు మారుతున్నారు. కానీ ఆధారాలు చూపించడం లేదదన్నారు. ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని నోటీసులు ఇచ్చినా న్యాయపరంగా ఎదుర్కొంటాం.