జనం న్యూస్ 25 జనవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
విశాఖ పట్నం లోని నగర పరిధిలో గల 30 వార్డ్, కొత్త సాలిపేటలోనీ బోడెమ్మ బంగ్లా (అపరకర్మల బంగ్లా ) దాతలు ఇచ్చిన స్థలమేనని వైజాగ్ బ్రాహ్మిన్స్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు కావూరు చరణ్ కుమార్, విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర మఠ మందిర ప్రముఖ పూడిపెద్ది శర్మ ఎం జె పి పార్టీ విశాఖపట్నం కోఆర్డినేటర్ అండ్ విజయనగరం ఇంచార్జ్ రాజేష్ కుమార్ శర్మ (ఈ వి రమణ )లు మరొక్కసారి ప్రకటించారు. శనివారం జరిగిన సమావేశంలో వారు. మాట్లాడుతూ ఈ స్థలం తమ పూర్వీకులకు 123 సంవత్సరాల క్రితం హిందూ సమాజానికి ఇచ్చారన్నారు.స్థానికులతో తలెత్తిన వివాదంలో జీవీఎంసీ జోనల్ కమిషనర్ -3, విశాఖ దక్షిణ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ సీతంరాజు సుధాకర్ ఒక పథకం ప్రకారం కుమ్మక్కై దానిని జీవీఎంసీ స్థలంగా ప్రకటించే దుస్సాహసం చేశారని మండిపడ్డారు. వీరిద్దరి చర్యలపై తాము కోర్టు కు వెళ్తామని హెచ్చరించారు.120 సంవత్సరాలనుండి అక్కడ దశదిన కర్మలు నిర్వహించుకుంటుంటే, అధికార మదంతో జోనల్ కమిషనర్ , సీతంరాజు సుధాకర్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మున్సిపల్ అధికారులు కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారన్నారు.ఈ విషయాన్ని తాము కూటమి పార్టీల అందరికీ తెలియజేసి, ఈ స్థలాన్ని కబ్జా చేద్దామని ప్రయత్నిస్తున్న అందరికీ బుద్ధి చెప్తామని, హెచ్చరించారు.బోడెమ్మ బంగ్లా విషయంలో రాష్ట్ర స్థాయి ఉద్యమానికి సిద్ధపడుతున్నట్లు విశ్వహిందూ పరిషత్తు ప్రతినిధి పూడిపెద్ద శర్మ విశ్వహిందూ పరిషత్ పెందుర్తి ఇన్చార్జ్ ఏలూరి వెంకటరమణమూర్తి శర్మ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సంఘాల అధ్యక్షులు పాల్గొన్నారు.


