Listen to this article

జనం న్యూస్‌ 25 జనవరి, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌

మన్నికైన నాణ్యత గల ఆభరణాల సంస్థ గోయాజ్‌ సిల్వర్‌ జ్యువెలరీ విజయనగరం ఎంజీ రోడ్డులోని 21వ స్టోర్‌ శనివారం ఉదయం ప్రారంభమైంది. దీనిని సినీనటి రితికా నాయక్ లాంఛనంగా ప్రారంభించారు. హీరోయిన్‌ను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆమెతో ఫొటోలు దిగేందుకు ఎగబడ్డారు. యువతులు అందంగా కనిపించేందుకు ఈ జ్యువెలరీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, ఈ షోరూంలో మంచి సిల్వర్‌ జ్యువెలరీ కలెక్షన్లు ఉన్నాయని సినీనటి రితికా నాయక్ అన్నారు. గోయాజ్‌ సీఈవో వేములూరి రాజా మాట్లాడుతూ గోయాజ్‌ స్టోర్‌ ప్రారంభం సందర్భంగా జనవరి 24 నుంచి ఫిబ్రవరి 15 వరకు అద్భుతమైన ఆఫర్లను గొప్ప ప్రారంభ ఆఫర్లతో అందిస్తున్నట్లు తెలిపారు. అతి తక్కువ కాలంలోనే ప్రజల మన్ననలు పొందిన ఏకైక సిల్వర్‌ జ్యువెలరీ స్టోర్‌ గోయాజ్‌ లో వెండి ఆభరణాలు అందుబాటులో ఉన్నాయన్నారు.