దడిగి చౌరస్తా వద్ద ముల్ల పొదలు తొలగింపు….
బిచ్కుంద జనవరి 25 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలం శనివారం నాడు బిచ్కుంద పోలీస్ స్టేషన్ పరిధిలోని దడిగి చౌరస్తా వద్ద బిచ్కుంద – బాన్సువాడ రహదారిపై ఇరువైపులా ఉన్న చెట్లు, ముల్లు పొదలు వాహనదారులకు, పాదచారులకు ఇబ్బందులు కలిగిస్తూ రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్న నేపథ్యంలో ప్రజల భద్రతను ప్రధానంగా దృష్టిలో ఉంచుకొని బిచ్కుంద పోలీసులు చర్యలు చేపట్టారు.ఎస్సై రాజు, పోలీస్ సిబ్బంది పర్యవేక్షణలో జెసిబి సహాయంతో రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్లు, ముల్లు పొదలను పూర్తిగా తొలగించినారు . రోడ్డుపై ప్రయాణించే వాహనదారులకు స్పష్టమైన దృష్టి లభించి, ప్రమాదాల నివారణకు అవకాశం కలిగింది.ప్రజల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ, రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా ఇటువంటి కార్యక్రమాలు కొనసాగించబడతాయని బిచ్కుంద పోలీస్ అధికారులు తెలిపారు.





