Listen to this article

జనం న్యూస్‌ 26 జనవరి, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌

విజయనగరం జిల్లా పరిషత్ కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఈరోజు అత్యంత వైభవంగా జరిగాయి. జిల్లా పరిషత్ చైర్మన్, వైయస్సార్ సిపి జిల్లా అధ్యక్షులు, భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) ముఖ్య అతిథిగా పాల్గొని మహాత్మా గాంధీ చిత్రపటానికి, బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జెడ్పీ సీఈఓ బి.వి సత్యనారాయణ జాతీయ జెండాను ఎగురవేశారు. చిన్నారుల నృత్య ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. ప్రతిభ కనబరిచిన సిబ్బందికి ప్రశంసా పత్రాలు, పదోన్నతి పత్రాలు మరియు కారుణ్య నియామక పత్రాన్ని చిన్న శ్రీను అందజేశారు.
రాజ్యాంగ బద్ధంగా నా హక్కులు, విధులు తెలుసుకుని సుపరిపాలన సాగించాను” అని చిన్న శ్రీను ఈ సందర్భంగా పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు:విజయనగరం జడ్పిటిసి శ్రీను, ఎల్ కోట ఎంపీపీ గేదెల శ్రీనివాసరావు, జిల్లా పరిషత్ ఉప ముఖ్య కార్య నిర్వహణ అధికారి ఆర్.వెంకట్ రామన్ మరియు ఇతర జిల్లా పరిషత్ సిబ్బంది పాల్గొన్నారు.