జనం న్యూస్ జనవరి 26 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
రుద్ర బెస్ట్ హెల్పింగ్ ఫౌండేషన్ నంది అవార్డ్స్ ఆల్ ఇన్ టాలెంట్ అవార్డ్స్2026 హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో వివిధ రంగాల్లో విశిష్ట కృషి చేసిన ప్రముఖులకు అవార్డ్స్ అందజేయడం జరిగింది గత 20 సంవత్సరాలు గా జానపద రంగంలో పగటి వేషాల్లో బుర్రకథ సాంఘిక నాటక వీధి నాటకాలు రంగస్థలం ఏకపత్రం ఆల్ ఇండియా రేడియో టీవీ మరియు సినిమా రంగాల్లో విశిష్ట కృషి చేసి బహుముఖ ప్రజ్ఞాశాలిగా అలాగే భారతీయ జనతా పార్టీ స్ఫూర్తి అనే పేరుతో సంచార జాతులు అందర్నీ ఒక చోట చేర్చి వారి విశిష్టతని ప్రపంచాన్ని తెలియజేయడం కోసం పెట్టినటువంటి స్ఫూర్తి సభ కోసం కోనసీమ అంతా నాతో నాతో పర్యటన చేసి అలాగే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఓబీసీ మోర్చా కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడంలో జిల్లా అంతా పర్యటనలో నాకు తోడ్పాటు అందించిన విర్నాల రమణ బాబు గారికి ఈ అవార్డు రావడం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఓబీసీలందరూ కి ఆనందదాయకం అలాగే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఓబీసీ మోర్చా తరఫున వారికి అభినందనలు తెలియజేస్తూ పసుపులేటి మహాలక్ష్మి రావు



