జనం న్యూస్ జనవరి 26 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండల కేంద్రంలోని జెడ్పీఎస్ఎస్ బాలుర ఉన్నత పాఠశాలలో సోమవారం 77వ గణతంత్ర వేడుకలను ప్రధానోపాధ్యాయుడు జనార్ధన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించినారు. మొదట పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జనార్ధన్ జాతీయ జెండాను ఆవిష్కరించినారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శ్రీ మత్స్యగిరి స్వామి దేవాలయ చైర్మన్ సామల బిక్షపతి పాల్గొని అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులు విద్యతోపాటు క్రీడలలో రాణించాలని అన్నారు. క్రీడలలో గెలుపొందిన విద్యార్థులకు చైర్మన్ బహుమతుల ను ప్రధానం చేసినారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాజబాబు సదానందం పద్మ సత్య ప్రసాద్ రాము వంశీధర్ శ్రీనివాస్ రాజిరెడ్డి రాజేష్ శర్మ విద్యార్థులు పాల్గొన్నారు…


