ఉత్తమ ఉపాధ్యాయులకు ప్రతిభా పురస్కారాలు అందించిన యాజమాన్యం
జనం న్యూస్- జనవరి 26- నాగార్జునసాగర్ టౌన్-
నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీలోని స్థానిక సెయింట్ జోసెఫ్ హై స్కూల్ లో 77వ భారత దేశ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ సిస్టర్ లలిత శ్యామల జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆమె విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ భారత జాతీయత దేశభక్తి భావాలు అభివృద్ధి క్రమశిక్షణ అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం పాఠశాల విద్యార్థులు దేశభక్తి గీతాలు, నృత్య ప్రదర్శనలతో చూపరులను ఆకట్టుకున్నారు. విద్యార్థులు నిర్వహించిన మార్చ్ ఫాస్ట్, పిరమిడ్స్ కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అనంతరం సెయింట్ జోసెఫ్ పాఠశాల యాజమాన్యం ఉపాధ్యాయ వృత్తిలో అత్యున్నత కార్య దక్షత, నిబద్ధత కలిగిన పాఠశాల ఉపాధ్యాయులు అయినటువంటి శివకుమార్ మరియు మల్లీశ్వరిలకు ప్రతిభ పురస్కారాలను అందజేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఫాదర్ మధుబాబు, సిస్టర్ శాంతి, సెయింట్ జోసెఫ్ పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.


