Listen to this article

జనం న్యూస్- జనవరి 26- నాగార్జునసాగర్ టౌన్-

నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీ లోని ముస్లిం మైనారిటీ ఎంప్లాయిస్ అసోసియేషన్ బిల్డింగ్ (ఈఈ/27) లో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మైనారిటీ నాయకులు భారత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. మైనార్టీ నాయకులు మాట్లాడుతూ ఎందరో స్వాతంత్ర సమరయోధుల త్యాగఫలం వారి సుదీర్ఘ పోరాటం ద్వారా వచ్చిన స్వాతంత్ర ఫలాలను పరిపాలనలో అమలు చేయాల్సిన బాధ్యతలను విధులను తెలిపే రాజ్యాంగం అమల్లోకి వచ్చిన ఈరోజును గణతంత్ర దినోత్సవంగా జరుపుకోవడం ఎంతో ఆనందదాయకమని, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని ప్రజాస్వామ్య పరిరక్షణకు ఆయన రాసిన రాజ్యాంగమే కారణం అని అన్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మైనారిటీ నాయకులు, పెద్దలు, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.