Listen to this article

మద్నూర్ జనవరి 26 జనం న్యూస్

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ తహశీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న గిర్దావర్ ఎం. శంకర్, జూనియర్ అసిస్టెంట్ యు. రవి కుమార్ లు ఉత్తమ ఉద్యోగులుగా ఇంచార్జీ కలెక్టర్ వి విక్టర్, DRO మధుకర్, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందుకున్నారు.ఈ సందర్భంగా మద్నూర్ తహశీల్దార్ ఎం డి. ముజీబ్ గారు మాట్లాడుతూ తమ ఉద్యోగులు ఉత్తమ ఉద్యోగులుగా ఎంపిక కావటం అభినందనీయం అన్నారు. వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ ప్రశంసలు ఆదర్శంగా తీసుకొని ఇంకా నిబద్ధతతో పని చెయ్యాలని సూచించారు.ప్రశంసా పత్రాలు అందుకున్న శంకర్, రవి లు మాట్లాడుతూ తమ సేవలను గుర్తించినందుకు జిల్లా కలెక్టర్ గారికి , బాన్సువాడ సబ్ కలెక్టర్ గారికి, మద్నూర్ తహసీల్దార్ గార్లకు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్ లో ఇంకా నిబద్ధతతో పని చేస్తామని, ప్రజలకు అత్యుత్తమ సేవలు అందిస్తామని తెలిపారు.